ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడోద్దు: ఎస్​ఎఫ్​ఐ

మాకు డీఎడ్​ పరీక్షలు నిర్వహించాలని మేనేజ్​మెంట్​ కోటాలో విద్యనభ్యసించిన విద్యార్థులు డిమాండ్​ చేశారు. మా భవిష్యత్తుతో ఆటలు ఆడోద్దని కోరారు. ఎస్​ఎఫ్​ఐ, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో.. విజయనగరం జిల్లా కలెక్టరేట్​ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

sfi-protest-at-vizianagaram-collectorate-for-conduct-ded-exams-to-management-students-also
ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడోద్దు: ఎస్​ఎఫ్​ఐ

By

Published : Sep 25, 2020, 7:38 PM IST

మేనేజ్​మెంట్​ కోటాలో విద్యనభ్యసించిన డీఎడ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్ధులు, ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2018-20 డీఎడ్ విద్యార్థులకు వెంటనే పరీక్ష నిర్వహించాలని నినాదాలు చేశారు. కౌన్సిలింగ్ ద్వారా విద్యనభ్యసించిన విద్యార్థులకు.. డీఎడ్​ పరీక్షలు ఈ నెల 28 నుంచి జరగనున్న నేపథ్యంలో మేనేజ్​మెంట్​ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలనని డీవైఎఫ్​ఐ నాయకులు మణికంఠ అన్నారు. వారికి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని కఠినతరం చేస్తామని హెచ్చరించారు.

వారి పరిస్థితి ఆయోమం...

కౌన్సెలింగ్​ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయడం వల్ల మేనేజ్​మెంట్​ విద్యార్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి, కష్టపడి చదివిన మా ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. మా భవిష్యత్తుతో ఆటలు ఆడోద్దని కోరారు.

జీవో 30 సవరణతో కష్టాలు...

ఈ బ్యాచ్​కు 2019 జులైలోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. నూతన ప్రభుత్వంలో జీవో నంబరు 30ను తొలగించడం వల్ల పరీక్షల నిర్వ హించలేమని అధికారులు చెబుతున్నారని డీవైఎఫ్​ఐ నాయకులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వివేకా హత్య కేసు: ఆ ముగ్గురిని విచారిస్తున్న సీబీఐ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details