అధ్వాన్నంగా మారిన రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ... విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరను చీపురువలస గ్రామస్థులు అడ్డుకున్నారు. మక్కువ మండలంలోని శంబరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ శంకుస్థాపనకు... ఎమ్మెల్యే హాజరవుతున్నారన్న సమాచారం అందుకున్న చీపురువలస గ్రామస్థులు... రాజన్నదొరను అడ్డుకున్నారు.
చీపురువలసలో ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు
విజయనగరం జిల్లా చీపురువలసలో స్థానికులు ఆందోళన చేశారు. గ్రామంలోని రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ... సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరను అడ్డుకున్నారు.
చీపురువలసలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అడ్డగింత
శంబర నుంచి మామిడిపల్లి మధ్య ఉన్న రెండు కిలోమీటర్ల రహదారి అధ్వాన్నంగా మారిందని ఎమ్మెల్యే ముందు వాపోయారు. వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అన్నారు. ఈ సమస్యపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేదని ఆవేదన చెందారు. గ్రామస్థుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి:టాపర్లకు కార్లు బహుమతిగా ఇచ్చిన మంత్రి