విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో లాక్డౌన్తో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సమయంలో ఆదాయం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సాధించారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. సీట్లని తొలగించి ఒక్కో బస్సులో 6 నుంచి 7 టన్నుల వరకు మొక్కజొన్న రవాణా అయ్యేలా చూస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 బస్సులను రవాణాకు అనువుగా మార్చినట్లు డిపో మేనేజర్ అప్పలరాజు తెలిపారు.
ఆర్టీసీ ప్రత్యామ్నాయం.. పంట తరలింపుతో ఆదాయం
లాక్డౌన్తో ఎక్కడిబస్సులు అక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులను అధికారులు నిత్యావసరాల రవాణా కోసం వినియోగిస్తున్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.
RTC