Tdp leaders meeting in Vijayanagaram: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లాలోని రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించి నేడు విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో బుద్ధా వెంకన్న, అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై టీడీపీ నేతలు సమీక్ష - 2వేల నోటు కనపడటం లేదు అయ్యన్న
Tdp leaders meeting in Vijayanagaram: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లాలోని రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్న విషయం విధితమే. పర్యటనకు సంబంధించి నేడు విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు.

విజయనగరంలో టీడీపీ ముఖ్య నేతల సమీక్ష
సమీక్ష అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో మూడు రోజుల పర్యటనకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. మూడేళ్లుగా ప్రజలు చాలా ఓపిక పట్టి, నేడు బహిరంగంగానే వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని, ఈ విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డే స్వయంగా చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి