అధికార భాషా సంఘం సభ్యులు అధికారిక పర్యటనకు విజయనగరం వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో తెలుగు భాష అమలుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చర్చించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయ అధికారులు తెలుగు భాషలోనే మాట్లాడాలని కోరారు. వివిధ శాఖల్లో తెలుగు భాషలోనే పాలన జరుగుతుందన్నారు. వంద శాతం తెలుగు భాష వాడుకలో ఉన్న కార్యాలయాల అధికారులని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి స్కూలులో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి జీవోను ప్రవేశ పెట్టారని... అందులో భాగంగా 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరని చెప్పారు.
'ప్రభుత్వ అధికారులు తెలుగు భాషలోనే మాట్లాడండి' - విజయనగరంలో అధికార భాషా సంఘం తాజా న్యూస్
అధికార భాషా సంఘం సభ్యులు అధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంగా విజయనగరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో తెలుగు భాష అమలుపై చర్చించారు.
తెలుగు భాషపై విజయనగరంలో సమీక్షా సమావేశం