విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అంగన్వాడి భవన నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మండలంలో 91 అంగన్వాడీ కేంద్రాలకుగాను 28 మాత్రమే సొంత భవనాలు ఉన్నట్లు ఎంపీడీవో ప్రకాష్ రావు తెలిపారు. మిగిలిన కేంద్రాలకు స్థల పరిశీలన చేసి అవసరమైన చోట కొత్త భవన నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వారంరోజుల్లో స్థలాలకు సంబంధించి సర్వే చేసి హద్దులు చూపించాలని పంచాయతీరాజ్ ఏఈ చంద్రునాయుడుకు సూచించారు.
అంగన్వాడి భవన నిర్మాణాలకు మోక్షం
జిల్లాలో అంగన్వాడి భవన నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంగన్వాడి భవన నిర్మాణాలకు మోక్షం