ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా పైడితల్లి అమ్మవారి తొలేళ్ల పండుగ - సిరిమానోత్సవం వార్తలు

విజయనగరం పైడితల్లి అమ్మమవారి సిరిమానోత్సవంలో తొలిఘట్టం తొలేళ్ల పండుగ కార్యక్రమం వైభవంగా సాగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

పైడితల్లి అమ్మవారి తొలేళ్ల పండుగ

By

Published : Oct 15, 2019, 5:01 PM IST

Updated : Oct 28, 2019, 8:29 AM IST

విజయనగరం పైడితల్లి అమ్మమవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో తొలిఘట్టం తొలేళ్ల పండుగ. ఈ సంబరం అంబరాన్నంటింది. తొలేళ్ల పండుగలో భాగంగా సోమవారం రాత్రి 11గంటలకు భాజా భజింత్రీలు, మేళతాళాలు, తప్పెట్ల మధ్య అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించేందుకు కోటలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పూజారులు, తలయారులు తరలొచ్చారు. కోటలోని రౌండ్ మహల్​లో ఘటాలకు శక్తి పూజలు నిర్వహించారు.అనంతరం ఘటాలను తిరిగి గుడివద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి చదురుగుడివద్ద పూజారి అమ్మావారి చరిత్రను చెప్పారు.తర్వాత ఘాటల్లో నిల్వచేసి పూజాది కార్యక్రమాలను నిర్వహించిన ధాన్యాపు విత్తనాలను రైతులకు పంచిపెట్టారు. తొలేళ్ల పండుగను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలి రావటంతో..పురవీధులన్నీ జనసందోహంగా మారాయి. ప్రధానంగా కోట, సింహాచలం మేడ, గంటస్తంభం వీధులు కిక్కిరిసిపోయాయి.

పైడితల్లి అమ్మవారి తొలేళ్ల పండుగ
Last Updated : Oct 28, 2019, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details