ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమార్తె పెళ్లి కోసం వెళ్లి.. కానరాని లోకాలకు! - parvathipuram bike accidents

కుమార్తెకు పెళ్లి కుదిరిన ఆనందంలో ఉన్న ఓ తండ్రి.. విజయనగరం పార్వతీపురంలో జరిగిన అనుకోని ప్రమాదంలో మృతి చెందాడు. పెళ్లికి పిలిచేందుకు బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. ద్విచక్ర వాహనంపై నుంచి జారిపడి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.

two wheeler accident
ద్విచక్రవాహన ప్రమాదం

By

Published : Nov 1, 2020, 6:34 PM IST

ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమాదవశాత్తు జారిపడి.. లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందాడు. కుమార్తె పెళ్లికి బంధువులను పిలవడానికి.. విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి అతడు బయలుదేరాడు. పక్కనున్న పుత్తూరు గ్రామానికి వెళ్లి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన లక్ష్మణరావును ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా.. కొద్ది సేపటికే కన్నుమూశాడు.

వెంకపేటకు చెందిన లక్ష్మణరావు కర్రల వ్యాపారం చేస్తూ జీవిస్తుండేవాడు. ఈనెల 22న కుమార్తె వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. మరో 20 రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగనుండగా.. యజమాని అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details