ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టుకూలి విద్యార్థి మృతి.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు

పాఠశాల ఆవరణలో చెట్టు కూలి ఒక విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి కాలు విరిగి తీవ్ర గాయాలైన ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది.

చెట్టుకూలి విద్యార్థి మృతి

By

Published : Sep 30, 2019, 7:25 PM IST

చెట్టుకూలి విద్యార్థి మృతి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఎమ్ఆర్​ పురంలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఇద్దరు విద్యార్థులపై చెట్టు కూలింది. 8వ తరగతి విద్యార్థి పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, 10వ తరగతి చదవుతున్న బాలాజీ అనే విద్యార్థి కాలు విరిగింది. దసరా సెలవుల సందర్భంగా.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో పవన్ కుమార్, బాలాజీ మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా అకస్మాత్తుగా చెట్టు కూలిపోయింది. చెట్టు కింద ఆడుకుంటున్న పవన్ కుమార్ తలమీద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలాజీను కొత్తవలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకు విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details