విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఆండ్ర రిజర్వాయర్ను చూసేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి. రిజర్వాయర్ సమీపంలోని గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వారంతా రిజర్వాయర్ చూడటానికి వెళ్లారు. అలకిడి కారణంగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. గాయపడిన వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆండ్ర రిజర్వాయర్ వద్ద తేనెటీగల దాడి..19 మందికి గాయాలు - విజయనగరం వార్తలు
తేనెటీగల దాడిలో 19మంది గాయాలపాలైన ఘటన మెంటాడ మండలంలో ఆండ్ర రిజర్వాయర్ వద్ద జరిగింది. శుభాకార్యానికి వెళ్లినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆండ్ర రిజర్వాయర్ వద్ద తేనెటీగల దాడి.