ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహకార చక్కెర కర్మాగారాలకు రూ.100 కోట్లు రుణం మంజూరు

రాష్ట్రంలో నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్​.సీ.డీ.సీ)రూ.100 కోట్ల రుణం విడుదల చేసింది. ఈ రుణంతో చెరకు రైతులకు పాత బకాయిలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

NCDC  release 100 crores loan for state sugar factories
చక్కెర కర్మాగారాలకు ఎన్​సీడీసీ రుణం

By

Published : Jan 10, 2020, 3:28 PM IST

చక్కెర కర్మాగారాలకు ఎన్​సీడీసీ రుణం

రాష్ట్రంలో నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్​.సీ.డీ.సీ) రూ.100 కోట్ల రుణం విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చెరకు రైతులకు చెల్లించాల్సిన పాత బకాయిలు, తీసుకున్న ఆప్కాబ్ రుణం చెల్లించేందుకు ఈ నగదును వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విజయనగరం జిల్లా భీమిసింగ్ షుగర్స్​కు రూ.12.45 కోట్లు, విశాఖ జిల్లా చోడవరంలోని కర్మాగారానికి రూ.40.28 కోట్లు, ఏటికొప్పాకకు రూ.27.61 కోట్లు, తాండవ షుగర్స్​కు రూ.19.66 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. నాలుగు చక్కెర కర్మాగారాలు 2018-19 సంవత్సరానికిగాను రైతులకు రూ.48 కోట్ల 70లక్షల నగదు చెల్లించాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details