రూ.4 కోట్ల మోసం కేసు.. నందిని కాటన్ మిల్లు భాగస్వామి కొల్లా సుధాకర్ అరెస్టు
19:15 September 13
ARREST
విజయనగరం జిల్లా రామబద్రపురం మండలం ముచ్చర్లవలసలో నందిని కాటన్ మిల్లులో భాగస్వామి కొల్లా సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కాకులమాను గ్రామానికి చెందిన కొల్లా సుధాకర్ కాటన్ మిల్లు కంపెనీకి, రైతులు అడ్వాన్స్ రూపంలో రూ. 4 కోట్ల మేర మోసం చేసి పరారయ్యాడు.
జిన్నింగ్ మిల్లు జనరల్ మేనేజర్ చెలవన్.. 2020 ఫిబ్రవరిలో పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి సుధాకర్ పరారీలో ఉన్నాడని.. ఇవాళ రామభద్రపురంలో పట్టుపడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. అతడు బంధువుల పేర్ల మీద భూములు కొనేందుకు ఆ డబ్బును వినియోగించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దీనిపై పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: RAINS EFFECT: వర్షాలతో కూలిన పూరిల్లు.. మహిళకు తీవ్రగాయాలు