Muncipal Workers Strike 15th Day in AP:తమ డిమాండ్లను నేరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. విజయనగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గంట స్తంభం వరకు మున్సిపల్ కార్మికులు భిక్షాటన చేశారు. సీఎం జగన్ తమ చెవిలో క్యాబేజీ, కాలీఫ్లవర్ పెట్టారంటూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కాలీఫ్లవర్ చేతపట్టుకొని నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన చేశారు. నందిగామ పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు పొర్లు దండాలు పెట్టారు. కార్మికుల డిమాండ్లను పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని రఘురాం విమర్శించారు. కార్మికులకు వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Muncipal Workers Strike in Ananthapuram: అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్ వరకు అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సంయుక్తంగా భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు పారిశుద్ధ్య కార్మికులు ఒంటినిండా పచ్చని ఆకులు చుట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను తయారు చేసి శవయాత్ర నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉద్ధృతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక చోట్ల వినూత్నంగా నిరసనలు చేశారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గంట స్తంభం వరకు బిక్షాటన చేశారు.
కార్మికుల వేతనాలు పెంచేందుకు డబ్బులు లేవనటం దారుణం- జగన్ సర్కారుపై బీవీ రాఘవులు ధ్వజం
Ongole Muncipal Office: ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు పంగనామాలు పెట్టుకొని మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పశ్చిమగోదావరి జిల్లా తణుకు, వైఎస్సార్ జిల్లా బద్వేలు పురపాలక కార్యాలయాల వద్ద ఆందోళన చేశారు. వైఎస్సార్ కూడలిలో చెత్త తరలిస్తున్న బండిని అడ్డుకుని తిరిగి రోడ్డుపై పోశారు. కడపలో పారిశుద్ధ్య కార్మికులు ఒంటికి ఆకులు కట్టుకుని ర్యాలీ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంతవరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు.