విజయనగరం జిల్లాలో ఆక్సిజన్ సమస్య పై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు. కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్, డీసీహెచ్ఎస్, సూపరింటెండెంట్‌తో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. ఐసీయూలో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బంది ఉందని.., 15 మందిని తక్షణమే వేరొక ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాం: మంత్రి పుష్ప శ్రీవాణి
విజయనగరం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.
minister pushpa srivani on oxygen scarcity in vijayanagaram
రోగుల పరిస్థితి విషమంగా ఉంటే.. విశాఖ తరలిస్తున్నామని అన్నారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభిస్తున్న వేళ మన ఆహార ప్రణాళిక ఎలా ఉండాలంటే..