ప్రమాదవశాత్తూ బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి - accident news at vizianagaram district
ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా గురుగుబిల్లి మండలం లక్కన్నపురంలో జరిగింది.
ప్రమాదవశాత్తూ బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లక్కన్నపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కన్నపుదొరవలసలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళ్తుండగా... జీఎంవలస మండలం కుడమ సమీపంలో బైక్ ప్రమాదవశాత్తు జారిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గౌరు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.