ఇంట్లోనే మద్యం దుకాణం.. నిర్వాహకురాలిపై కేసు నమోదు - liquor seazed at vizianagaram news
07:14 July 28
ఇంట్లోనే మద్యం దుకాణం.. నిర్వాహకురాలిపై కేసు నమోదు
అమె ఏకంగా ఇంట్లోనే మద్యం దుకాణం ఏర్పాటు చేసింది. వివిధ రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచింది. మద్యం దుకాణానికి మాత్రం సమయపాలన ఉంటుంది.. కానీ ఇక్కడ మాత్రం ఎనీ టైం అంటూ... మందుబాబులకు అందుబాటులో ఉంచుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో... మంగమ్మ అనే మహిళ ఇంట్లోనే మద్యం దుకాణం ఏర్పాటు చేసింది. సుమారు రూ.30 వేల విలువైన 102 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, మహిళపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: