ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటిస్తాం.. రక్షణ కల్పించండి

ఆంధ్రప్రదేశ్, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటిస్తామని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు తెలిపారు. అయితే అందుకు తమకు రక్షణ కల్పించాలని విజయనగరం జిల్లా ఎస్పీని కోరారు.

వినతి పత్రం
వినతి పత్రం

By

Published : Aug 18, 2021, 9:52 PM IST

ఆంధ్రప్రదేశ్, ఒడిశా వివాదాస్పద కొఠియా గ్రామాల్లో నలిగిపోతున్న గిరిజనులకు అండగా ఉంటామని అన్ని రాజకీయ పార్టీల నేతలు తెలిపారు. అయితే ఆ గ్రామాల్లో పర్యటించడానికి రక్షణ కల్పించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా పాటిల్​ను కోరారు. ఈ విషయంపై ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.

తమ పార్టీ ప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈనెల 5న కొఠియా ప్రాంతాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు విన్నవించామని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. అంతేకాకుండా ప్రతిగ్రామంలో తెలుగు బోర్డులు పెట్టాలని ఎమ్మెల్యే రాజన్నదొర, పీవో కుర్మానాధ్​లను కోరామని తెలిపారు. అయితే అది నచ్చక ఒడిశా అధికారులు, నాయకులు పిచ్చి,పిచ్చి గా ప్రవర్తించి అనవసర ప్రసంగాలు చేసారని ఎస్పీ దృష్టి కి తెచ్చారు.

కొఠియా గ్రామాలపై సుప్రీంకోర్టు స్పష్టం స్టేటస్​ కో ఇచ్చినప్పటికీ ఒడిశా అధికారులు, నాయకులు 22 గ్రామాల్లోనికి ఎలా ప్రవేశిస్తారని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.కామేశ్వరావు ప్రశ్నించారు.

కొఠియా పేరుతో పోలీసులు యంత్రాంగం ఉండి కూడా ఆ గ్రామంలో ఎందుకు లేదని ఎస్పీని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యానారాయణ ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగం కొఠియా వివాదాస్పద గ్రామాల గిరిజనులకి అందుబాటులో ఉంటే ఒడిశా అధికారుల నాయకుల హడావుడి ఉండేది కాదని అన్నారు. వెంటనే కొఠియాలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు.

ఇదీ చదవండి:ఆంధ్రా అధికారుల నిర్లక్ష్యం.. ఒడిశా అధికారుల చొరవ..

ABOUT THE AUTHOR

...view details