VILLAGERS PROTEST FOR DRINKING WATER: విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం వద్ద.. కింతలి వాణిపేట గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కర్మాగారం నిర్మాణ సమయంలో తమ భూములు ఇచ్చామని, ఆ సమయంలో యాజమాన్యం గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
PEOPLE PROTEST FOR WATER: భూములిచ్చాం.. కనీసం నీళ్లివ్వండి..
విజయనగరం జిల్లా లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం వద్ద.. కింతలివాణిపేట గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. కర్మాగారం కోసం భూములిచ్చిన తమకు హామీ ప్రకారం నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
కానీ.. కొన్ని నెలలుగా తమకు తాగునీరు అందడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మాగారం కాలుష్యంతో తాము రోగాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు.. కనీసం తాగునీరు కూడా అందట్లేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోవట్లేదని ఆరోపించారు. యాజమాన్యం తక్షణం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:నాకు జరిగిన అవమానం ఎవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి