ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకు.. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు రాజీనామా

వైకాపాకు మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు రాజీనామా చేశారు. పార్టీ నేతలు నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ex mla shatrucharla chandrasekhar raju
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు

By

Published : Feb 18, 2021, 5:13 PM IST

Updated : Feb 19, 2021, 7:57 AM IST

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మామ... మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు.. వైకాపాకు రాజీనామా చేశారు. "ప్రజా స్వామ్యం, విశ్వసనీయత అని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పటికీ.. పార్టీ నేతలు నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారు" అని చంద్రశేఖర్ రాజు ఆరోపించారు. వైకాపాకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు తీసేస్తామంటూ బెదిరించి.. భయానక వాతావరణంలో ఓట్లు వేయించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేతల అకృత్యాలతో మనస్సు భాదపడిందన్న ఆయన.. అలాంటి సంఘటనలు సహించేది లేదని, అందుకే వైపాకాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

త్వరలో భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తా...

తన స్వగ్రామమైన చినమేరంగిలో తన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి భర్త శత్రుచర్ల పరిక్షిత్ రాజు... పంచాయతీ ఎన్నికల అనంతరం ఓ వ్యక్తిపై దాడి చేశారని.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. త్వరలో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.

ఇవీ చూడండి:

పర్ల గ్రామంలో ఓట్ల లెక్కింపులో గందరగోళం

Last Updated : Feb 19, 2021, 7:57 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details