తమప్రాంతంలో అభయారణ్యం ఏర్పాటు ఆలోచనను అధికారులు విరమించుకోవాలని గిరిజన కుటుంబాలు కోరుతున్నాయి. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం పరిధిలోని జంతుకొండ వద్ద అభయారణ్యం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గిరిజనులు, ప్రజా సంఘాల నేతలు పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి ఏనుగులు పార్వతీపురం డివిజన్లోకి ప్రవేశించాయి. బెలగాం శివారు నుంచి ర్యాలీగా ఐటీడీఎకి చేరుకొని ధర్నా చేశారు. అభయారణ్యం ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సంఘాల నాయకులు శ్రీరామ్ ముూర్తి , ఆర్వీఎస్ కుమార్, రమణి రంజిత్ కుమార్, కృష్ణ గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
తమను తరిమేందుకే ప్రభుత్వం కుట్ర..గిరిజనుల ఆందోళన - విజయనగరం జిల్లా
వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమను తరిమేందుకు జంతుకొండ వద్ద అభయారణ్యం ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని గిరిజనులు, గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.
గిరిజనుల ధర్నా
ఇదీ చదవండి:"ఐక్యంగా ముందుకెళితేనే సమస్యల పరిష్కారం"