గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ - విజయనగరం జిల్లా ఎస్పీ గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన న్యూస్
విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఆరు గ్రామాల గిరిజనులకు ఎస్పీ రాజకుమారి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె గిరిజనులకు తెలిపారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎస్పీ
విజయనగరం జిల్లా మక్కువ మండలం నంద గ్రామంలో ఎస్పీ రాజకుమారి పర్యటించారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. బయటకు వెళ్లి వచ్చిన వాళ్లు చిన్న పిళ్లలను తాకవొద్దని సూచించారు. అనంతరం ఆరు గ్రామాల్లోని గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దంత వైద్యనిపుణుడు అనిల్ కుమార్ తనవంతు సాయంగా శానిటైజర్లు, మాస్కులను అందజేశారు.