విజయనగరం జిల్లా సీతానగరం మండలానికి చెందిన ఓ వృద్ధుడు అనారోగ్యంతో రెండు రోజుల క్రితం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో చేరారు. 65 ఏళ్ల వయసున్న ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. అంతకుముందే కరోనా పరీక్ష కోసం వృద్ధుడు నుంచి నమూనా సేకరించారు. చనిపోయిన తర్వాత వృద్ధుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసి.. మృతదేహాన్ని పురపాలక శాఖకు అప్పగించారు.
కరోనాతో మృతి..తమ ప్రాంతంలో ఖననం వద్దని స్థానికుల అభ్యంతరం - విజయనగరం జిల్లాలో కరోనా కేసులు
కరోనా పాజిటివ్ లక్షణాలతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని ఖననం చేసే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసుల సహకారంతో పురపాలక సిబ్బంది మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటు చేసుకుంది.
పురపాలక సిబ్బంది వృద్ధుడి మృతదేహాన్ని పట్టణ శివారులోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం మృతదేహాన్ని ఖననం చేస్తున్న సమయంలో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని ఇక్కడ ఖననం చేయవద్దని...వేరే చోటికి తరలించాలంటూ ఘర్షణకు దిగారు. గుంపును పోలీసులు చెదరగొట్టారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. సమీప కాలనీవాసులు పురపాలక కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ కనకమహాలక్ష్మి వారికి సర్దిచెప్పి పంపించారు.
ఇదీ చదవండి:ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..