విజయనగరం జిల్లా గరివిడి మండలంలో వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులను ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని.. కలెక్టర్ జవహరిలాల్ అధికారులను ఆదేశించారు. పనులను ఉన్నతాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.బాలుర, బాలికల వసతి గృహాలు, పరిపాలక భవనం, క్యాంటిన్ నిర్మాణ పనులను పరిశీలించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. సుమారు 59 కోట్ల 65 లక్షలతో నిర్మాణ బాధ్యతలను హయగ్రీవ ఇన్ఫోస్ట్రక్చర్ సంస్థకు టెండర్ల ద్వారా ఇచ్చామని తెలిపారు.
వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులు తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం జిల్లా గరివిడిలో వెటర్నరీ కళాశాల నిర్మాణ పనులను... కలెక్టర్ హరి జవహర్లాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్