విజయనగరం జిల్లా సాలూరులో శ్రీ గోకులకృష్ణ మందిరం వద్ద చాక్లెట్ గణేష్ భక్తుల పూజలందుకుంటున్నాడు. 10వేల చాక్లెట్లతో గణేష్ మహారాజ్‌ను గొల్ల వీధిలో యాదవ యువజన సంఘం, గోకుల కృష్ణ అభిరుచి సంఘం, మహిళా సత్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఒక్కొక్క వెరైటీగా వినాయకుడిని తయారు చేస్తున్నారు. గత ఏడాది స్మైల్ బాల్స్తో వినాయకుడు, ఈ ఏడాది చాక్లెట్స్ తో వినాయకుడు తీసుకువచ్చారు. పట్టణంలో ఈ వినాయకుడు అద్భుతంగా ఉన్నాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాకెట్ల గణపయ్య... ఎంతో తియ్యనయ్యా.. - saluru
సాలూరులో శ్రీగోకులకృష్ణ మందిరంలో చాక్లెట్ గణేశుడు కనువిందు చేస్తున్నాడు. భక్తులను ఆకర్షిస్తున్నాడు.
గణేశ్