విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలసలో అదృశ్యమైన తల్లీబిడ్డలు మృతి చెందారు. 39 ఏళ్ల వరలక్ష్మి, ఆమె 8 సంవత్సరాల కుమారుడు హర్షవర్ధన్ ఈనెల 15న అదృశ్యం అయ్యారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు.
పాచిపెంట రిజర్వాయర్‌లో తల్లీబిడ్డల మృతదేహం లభ్యం
విజయనగరం జిల్లాలో అదృశ్యమైన తల్లీబిడ్డల.. మృత దేహలు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున హర్షవర్ధన్(8) పాచిపెంట పెద్ద గెడ్డ రిజర్వాయర్‌లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం తల్లి కోసం పోలీసులు గాలించి.. శవాన్ని బయటకు తీశారు.
పాచిపెంట రిజర్వాయర్‌లో తల్లీబిడ్డల మృతదేహం లభ్యం
ఈ క్రమంలో.. తెల్లవారుజామున పాచిపెంట పెద్దగెడ్డ రిజర్వాయర్‌లో హర్షవర్ధన్.. శవమై తేలాడు. అనంతరం తల్లి ఆచూకీ కోసం విస్త్రృతంగా గాలింపు చేపట్టగా.. ఆమె శవం లభించింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్ఐ ఫక్రుద్దీన్, సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు.. తెలిపారు.
ఇదీ చదవండి:పీఎస్లో చోరీ... ప్రభుత్వ మద్యం దుకాణాల నగదు అపహరణ
Last Updated : Mar 17, 2021, 4:17 PM IST