ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జల సంరక్షణ చర్యల్లో జిల్లాకు అవార్డు.. కలెక్టర్​కు ప్రసంశలు

విజయనగరం జిల్లా జల సంరక్షణ చర్యల్లో అత్యంత ప్రగతి సాధించింది. ఈ క్రమంలో కేంద్రం అవార్డును కూడా ప్రకటించింది. దీంతో జిల్లా కలెక్టర్​కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

By

Published : Nov 7, 2020, 6:39 PM IST

Award to the district
Award to the district

జల సంరక్షణ చర్యల్లో విజయనగరం జిల్లా అత్యంత ప్రగతి సాధించిన క్రమంలో ఇటీవల కేంద్ర జలశక్తి సంస్థ, జిల్లాకు జాతీయ అవార్డును ప్రకటించింది. ఇందుకు కృషి చేసిన కలెక్టర్ హరి జవహర్ లాల్​కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ ఉద్యోగులతో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలు కలెక్టర్​ను అభినందించారు. పుష్పగుచ్చాలు అందజేసి.. శాలువలతో సత్కరించారు. జిల్లాలో జలసంరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నామని పలు పరిశ్రమల యాజమానులు కలెక్టర్​కు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details