ఈనెల 11న పోలింగ్ సందర్భంగా కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని విజయనగరం జిల్లా కురుపాం వైకాపా ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఘటన జరిగి వారం రోజులైనా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపైనా డీఐజీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. తన హత్యకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్నారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు.
నా హత్యకు శత్రుచర్ల కుట్ర: వైకాపా ఎమ్మెల్యే
కురుపాం వైకాపా ఎమ్మెల్యే బోరున విలపించారు. పోలింగ్ రోజున తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె... న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు.
కన్నీటి పర్యంతమైన వైకాపా ఎమ్మెల్యే