ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

విజయనగరం జిల్లావ్యాప్తంగా హనుమాన్​ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

By

Published : Apr 19, 2019, 7:51 PM IST

ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
విజయనగరం జిల్లావ్యాప్తంగా హనుమాన్​ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలతో శోభిల్లాయి. ప్రధానంగా విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో వేడుకలు కనులపండువగా జరిపారు. గత రాత్రి నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. విగ్రహాన్ని వెండి అభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్ప గంధంతో అలంకరించారు. అనంతరం వివిధ అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details