చల్లబడిన పార్వతీపురం... ప్రజల ఉపశమనం
ఎట్టకేలకు వరుణ దేవుడు కాస్త కరుణించాడు. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
పార్వతీపురంలో జోరుగా వర్షం
విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్మాయి. కొద్దిసేపు బలంగా గాలులు వీచాయి. అనంతరం 20 నిమిషాలపాటు జోరుగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. సుమారు నెల రోజులుగా ఎండలు అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా వర్షం రావటంతో ప్రజలు ఉపశమనం పొందారు.
TAGGED:
పార్వతీపురంలో జోరుగా వర్షం