ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

' ఆడపిల్లలను రక్షించుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ వేదిక అధ్యక్షుడు గొండు సీతారాం పిలుపునిచ్చారు. బాలల రక్షణే మా ధ్యేయం' పేరుతో విజయనగరంలో ఓ కార్యక్రమం జరిగింది.

child right protection forum
బాలల హక్కుల రక్షణ వేదిక నిర్వహించిన కార్యక్రమం

By

Published : Dec 2, 2020, 7:11 PM IST

ఆడపిల్ల అని తక్కువగా చూడకుండా.. మన పిల్లలు అన్న భావనతో వారిని పెంచాలని రాష్ట్ర బాలల హక్కుల రక్షణ వేదిక అధ్యక్షుడు గొండు సీతారాం అన్నారు. బాలికలను కాపాడలని నినదిస్తూ విజయనగరంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మాయిలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బాలికల సంరక్షణకు పాటుపడుతున్న వారికి సర్టిఫికెట్స్​ అందజేశారు.

ఎంతో అభివృద్ధి సాధిస్తున్న ఈ సమాజంలో ఇప్పటికీ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవటం దురదృష్టకరమని సీతారాం అన్నారు. పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లోనూ సమానంగా ముందడుగు వేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు బాలికలను ఉన్నతంగా పెంచాలని కోరారు. సమాజహితం కోసం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని తెలిపారు.

ఇదీ చదవండి: కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలకు నూతన హంగులు

ABOUT THE AUTHOR

...view details