విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో రాజాపులొవకి చెందిన కిలారి గణేష్ (37) అనే వ్యక్తి మద్యానికి బానిసైఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పిల్లల్ని వదిలేసి... నాన్న, చెల్లి దగ్గరే ఉంటూ దర్జీగా పని చేస్తున్నాడు. మందు తాగుతూ... మానసికంగా కుంగిపోయిన గణేష్ ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య - రాజాపులోవలో వ్యక్తి ఆత్మహత్య వార్తలు
విజయనగరం జిల్లా రాజాపులోవలో ఓ వ్యక్తి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసై.. మానసికంగా కుంగిపోవడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులంటున్నారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య