విజయనగరం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామానికి చెందిన బర్ల గోపాలకృష్ణ (22) మత్స్యకారుడు. అతను చేపల వేటకు రాత్రి 9 గంటలకు చీపురు వలస గ్రామం నుంచి వెళ్లాడు. భోజనాల క్యారేజీతో బర్ల గోపాలకృష్ణ, మరో ఇద్దరు కలిసి వేట కోసం అక్కడే పడుకున్నారు. తెల్లవారేసరికి వలలో చిక్కుని... నీటిలో మునిగి గోపాలకృష్ణ చనిపోయి ఉన్నాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి సమాచారాన్ని సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జీవనాధారమే ప్రాణం తీసింది! - A fisherman who went for a fishing trawler died in a fishing trap.
విజయనగరం జిల్లా సాలూరు మండలంలో చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారుడు.. చేపలు పట్టే వలలో చిక్కి మృతి చెందాడు.
చేపల వేటలో మత్స్యకారుడు మృతి