ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BOY DEATH : అప్పటి దాకా ఆడాడు..కోనేటిలో స్నానం చేద్దామనుకున్నాడు...అంతలోనే...

రోజులాగే స్నేహితులతో కలిసి కోనేటి వెళ్లాడా బాలుడు. స్నానం చేద్దామని కోనేటిలోకి దిగాడు.ఆనందంగా తోటివారితో కలిసి అప్పటి వరకూ ఆడుకున్నాడు... ఆడుతూనే నీటిలో మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు...

BOY DEATH
అప్పటి దాకా ఆడాడు..కోనేటిలో స్నానం చేద్దామనుకున్నాడు...అంతలోనే...

By

Published : Oct 29, 2021, 10:27 AM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామానికి చెందిన శ్రీను, రమ దంపతులు. వారి కుమారుడు నగేష్ (11) స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో కోనేరుకి వెళ్లాడు. తోటి పిల్లలతో సంతోషంగా ఆడుతూ.. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా కోనేటిలో మునిగి పోయాడు. ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే దీంతో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే కోనేరు దగ్గరకి పరుగులు పెట్టారు. కోనేటిలో గాలించగా నగేష్ మృతదేహం లభ్యమైంది. మరో గంటలో బడికి వెళతాడు అనుకున్న కుమారుడు ఇలా మృత్యువు ఒడికి చేరడంతో దినసరి కూలీలు అయినతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details