విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వృక్షం.. మరమ్మతుల కోసం షెడ్లో పెట్టిన లారీపై పడింది. 26వ జాతీయ రహదారిలో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న లారీల మరమ్మతుల షెడ్ వద్ద ఈ సంఘటన జరిగింది.
చెట్టు విరిగి పడిన కారణంగా... లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ ప్రాంతోలని విద్యుత్ తీగలు సైతం తెగి పడ్డాయి. ఫలితంగా.. చుట్టు పక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ మార్గంలో ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.