తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి విశాఖ వరకు తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక పైపులైను ప్రతిపాదనల్లో మార్పులు చేస్తున్నారు. గతంలో ఏలేశ్వరం నుంచి విశాఖకు పైపులైను ప్రతిపాదన ఉంది. డీపీఆర్ కూడా సిద్ధమైంది. పోలవరం ఎడమ కాలువ నుంచే ఈ పైపులైను మొదలవ్వాలన్న ప్రతిపాదనలూ ఆ తర్వాత వచ్చాయి. తాజాగా ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత.. పాత ప్రతిపాదనకే ప్రభుత్వం సుముఖత చూపిందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. ఇదివరకే పూర్తయిన డీపీఆర్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు స్పష్టతనిచ్చారు. తాజా అంచనా ప్రకారం ఏలేశ్వరం నుంచి సుమారు 150 కి.మీ పైపులైనుకు రూ.1700కోట్ల దాకా వ్యయం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తాగునీటి పైప్‌లైన్ డీపీఆర్‌లో సవరణలు
తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయరు నుంచి విశాఖ వరకు తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక పైపులైను ప్రతిపాదనల్లో మార్పులు చేస్తున్నారు. గతంలో ఏలేశ్వరం నుంచి విశాఖకు పైపులైను ప్రతిపాదన ఉంది.
Amendments