ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ పట్టింపు లేకుండా వైకాపాలో చేరికలా?! - అల్లిపురంలో వైకాపా జాయినింగ్​లు

కరోనా కాలం.. గుంపులుగా చేరితే మనకు.. మన కుటుంబానకి.. సమాజానికి ప్రమాదమని అందరికి తెలుసు. అయినా ఎన్నికలమీద.. పార్టీమీద ఉన్న ప్రేమతో.. గెలవాలన్న తాపత్రయంతో లాక్​డౌన్​ని కొందరు నాయకులు పట్టించుకోవటం లేదు. తమ పార్టీల్లో అభ్యర్థుల్ని చేర్చుకోవాలనే కుతూహలం తప్ప.. ప్రజల ఆరోగ్యంపై భాద్యత లేదు.

ycp Joinings without follow lockdown at allipuram in visakha
ycp Joinings without follow lockdown at allipuram in visakha

By

Published : Apr 11, 2020, 5:30 PM IST

లాక్​డౌన్​ పట్టింపు లేకుండా వైకాపా జాయినింగ్​లు ఎలా..!

కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తున్న సమయంలో విశాఖ రెడ్​జోన్​గా ఉన్న అల్లిపురం ప్రాంతంలో వైకాపాలో చేరికలు కలకలం రేపుతున్నాయి. విశాఖలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు అల్లిపురంలోనే నమోదయ్యింది. ఈ మేరకు అక్కడ నివసించే ప్రజలెవ్వరూ ఇంట్లోనుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇవేమి పట్టని కొందరు అల్లిపురం 33వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు.. కొల్లి వారి వీధిలో ఉన్న యువకులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

అందులో ఆ ప్రాంత వాసులంతా గుంపులు గుంపులుగా ఒకచోట చేరి వైకాపాలోకి ఆహ్వానించేలా కండువాలు కప్పే దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి. కరోనా కష్ట కాలంలో స్థానిక వైకాపా అభ్యర్థులు ఇలా వ్యవహరించడం పట్ల చుట్టుపక్కల ఉన్న నిర్వాసితులంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటివి జరగకుండా.. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details