విశాఖలో వైకాపా, తెలుగుదేశం మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. రామకృష్ణపురంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. ఆయనపై రాళ్లు, కొబ్బరి కాయలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయనతో వచ్చిన అనుచరులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే పై వైకాపా వర్గీయుల రాళ్లదాడి వైకాపా వర్గీయుల దుశ్చర్యలు పెచ్చుమీరుతున్నాయని ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ దాడులకు నిరసనగా ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దాడికి పాల్పన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వైకాపా వర్గీయుల పై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో ఎమ్మెల్యే వెలగపూడి నిరసన విరమించారు. మరో రెండు రోజుల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే మరోసారి నిరసన చేస్తామని వెలగపూడి హెచ్చరించారు. వైకాపా శ్రేణులు శాంతియుతంగా ఉండే విశాఖను భగ్నం చేస్తున్నారని, తెదేపా వారిని బెదిరించాలని చూస్తున్నారని రామకృష్ణబాబు చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా వారి పై పోరాటం చేస్తామని వెలగపూడి అన్నారు.
ఇవీ చదవండి:'కక్ష తీర్చుకోవడానికి కరోనా సమయాన్ని వాడుకుంటున్నారు'