ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగరపువలస అవంతి కళాశాలలో.. ఇస్రో ఎగ్జిబిషన్ - isro

విశాఖ జిల్లా తగరపువలసలోని అవంతి కళాశాలలో ఇస్రో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఇస్రో పనితీరు, పరిశోధనలు, జీపీఎస్, వాతావరణం మార్పులు వంటి వాటిపై విద్యార్థులకు రెండు రోజులపాటు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రంలో పది కేంద్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

విశాఖ జిల్లా అవంతి కళాశాలలో ప్రారంభమైన ఇస్రో ఎగ్జిబిషన్

By

Published : Oct 9, 2019, 6:12 PM IST

విశాఖ జిల్లా అవంతి కళాశాలలో ప్రారంభమైన ఇస్రో ఎగ్జిబిషన్

అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా తగరపువలస అవంతి కళాశాలలో ఇస్రో ప్రదర్శనను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 22 మంది శాస్త్రవేత్తలు... ఇస్రో పని తీరు, పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. మొబైల్స్ టౌన్ ప్లానింగ్ మ్యాపింగ్ నావిగేషన్, జీపీఎస్, వాతావరణంలో మార్పులు, తుపాను హెచ్చరికలు, సునామీలు, ఉపగ్రహాల పరిశోధనలు వంటి అంశాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ గ్రహదురై పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

isroavanthi

ABOUT THE AUTHOR

...view details