ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అత్యాచార బాధితురాలిని అన్ని విధాలా ఆదుకుంటాం' - విశాఖ మన్యంలో మైనర్​పై అత్యాచారం

విశాఖ మన్యం జీ. మాడుగుల మండలం జన్నేరులో అత్యాచార బాధితురాలిని ఆదుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి తెలిపారు. ఆ కేసులో ముద్దాయిల్ని విడిచిపెట్టబోమని చెప్పారు.

woman commission member respond on minor rape case in janneru vizag district
మణికుమారి, మహిళా కమిషన్ సభ్యురాలు

By

Published : Jul 8, 2020, 12:26 PM IST

విశాఖ మన్యం జీ. మాడుగుల మండలం జన్నేరులో జూన్ 27న మైనర్​పై జరిగిన అత్యాచారంపై మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి స్పందించారు. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బాలికకు ఆధార్, బ్యాంక్ అకౌంట్ లేనందున పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు.

ఇటీవల వివిధ పార్టీల గిరిజన సంఘం నాయకులు, ఐకాస కార్యకర్తలు బాధితురాలని సందర్శించారు. మహిళా కమిషన్ గిరిజన బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఎందుకు మాట్లాడ్డంలేదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. ఈ క్రమంలో కమిషన్ సభ్యురాలు స్పందించారు. బాలికకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details