విశాఖ నగరంలోని 34వ వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నాడు పీలా హరిప్రసాద్. దీనితోపాటు యువ సేవ అనే ఓ స్వచ్ఛంద సంస్థనూ నడుపుతున్నాడు. వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నందుకు ప్రతినెలా ప్రభుత్వం తనకు ఇస్తున్న వేతనాన్ని పూర్తిగా పేద ప్రజలకే ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేద కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తున్నాడు. రేషన్ కార్డు, ఇతర ఆధారాలు లేని మహిళలకు, పేదలకు తన జీతంతో నిత్యావసర సరుకులను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
వాలంటీర్ పెద్ద మనసు...జీతమంతా పేదల కోసం - పేదలకు తనవంతు సహాయం అందిస్తున్న వార్డు వాలంటీర్
వార్డు వాలంటీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ప్రభుత్వం తనకు ఇస్తున్న వేతనాన్ని పేదలకు ఖర్చు పెడుతున్నాడు ఆ యువకుడు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నాడు. మానవసేవే మాధవ సేవ అంటూ..యువ సేవ అనే స్వచ్ఛంద సంస్ధ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
ward-volunteer-helps-to-poor-people
Last Updated : Apr 13, 2020, 10:15 PM IST