ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్మిక సమ్మె గోడ పత్రిక విడుదల

ఈ నెల 3న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు గానూ... విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐటీయూ విభాగం గోడ పత్రికను విడుదల చేసింది. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Wall posters release for building workers' strike at narsipatnam in visakhapatnam district
నర్సీపట్నంలో కార్మిక సమ్మెకు గోడ పత్రిక విడుదల

By

Published : Jul 1, 2020, 2:18 PM IST

ఈనెల 3వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐటీయూ విభాగం... గొలుగొండ మండలంలో గోడ పత్రికను విడుదల చేసింది. ఈ మేరకు నర్సీపట్నం డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒక్కో కార్మిక కుటుంబానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details