విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ - 1 ఎం వేణుగోపాలరెడ్డి... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి జిల్లాలోని చెరువులు, కుంటలను పరిరక్షించేందుకు 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. నీటి వనరులను పరిరక్షించటం, పునరుద్ధరించటం అంత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలన్నారు.
చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచటం, కాలుష్యం బారిన పడకుండా కాపాడటం... ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ పరిధిలో వాననీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ సూచించారు. భవిష్యత్తులో తాగునీటి కొరత నివారించేందుకు జల వనరులు కాపాడుకోవాలన్నారు.