ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ బీచ్ రోడ్లో అగ్నిమాపక అవగాహన నడక

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్​లోని జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన నడక నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.

విశాఖ బీచ్ రోడ్లో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం

By

Published : Apr 18, 2019, 10:51 AM IST

Updated : Apr 19, 2019, 7:25 AM IST

'అగ్ని ఆర్పుట కంటే అగ్ని నిరోధక చర్యలే మేలు' అనే నినాదంతో ఈ నెల 14వ తేదీ నుంచి 20 వరకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విశాఖ ప్రాంతీయ ఫైర్ సేఫ్టీ అధికారి ​శ్రీనివాసరావు తెలిపారు. సాగరతీరంలో ఉదయపు నడకకు వచ్చే వారికి కరపత్రాలు పంచి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ బీచ్ రోడ్​లోని జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన నడక నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలని.. సెలవుల్లో ఊర్లకి వెళ్లేవారు తప్పని సరిగా ఇంట్లోని విద్యుత్ స్విచ్ లను ఆపివేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బందితో పాటు వివిధ ఫైర్ సేఫ్టీ కళాశాల విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

విశాఖ బీచ్ రోడ్లో అగ్నిమాపక అవగాహన నడక
Last Updated : Apr 19, 2019, 7:25 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details