ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బహుళ నృత్యరీతులపై పట్టు... విశాఖ బాలికల టాలెంట్

తమ నృత్యాలతో థాయ్​లాండ్​ వాసులను మెప్పించారు విశాఖ బాలికలు. అన్ని రకాల నృత్యాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు.

బాలికలు

By

Published : Jul 3, 2019, 6:17 AM IST

బహుళ నృత్యరీతులపై పట్టు... విశాఖ బాలికల టాలెంట్

థాయ్​లాండ్ వేదికపై మన భారతీయ నృత్య కళలతో విశాఖ బాలికలు ఆకట్టుకున్నారు. బహుభాషా నృత్య కళలను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. థాయ్​లాండ్​కు చెందిన శ్రీనఖరిన్విరాట్ విశ్వవిద్యాలయం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ కళా, సాంస్కృతిక నృత్యోత్సవంలో ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశాన్ని ఏడుగురు బాలికల నృత్య బృందం సొంతం చేసుకుంది. ఒకే వేదికపై, ఒకే బృందం భిన్నమైన వస్త్రాలంకరణలతో, వైవిధ్యమైన నృత్య ప్రదర్శనలు ఇస్తూ అందరినీ అబ్బుర పరిచింది. విశాఖలోని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్​కి చెందిన ఈ నాట్య బృందం మన దేశ జానపద, నృత్య కళలకే పరిమితం కాకుండా బంగ్లా, నేపాలీ నృత్యరీతులపైనా పట్టు సాధించారు. వివిధ రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చి కళా ప్రేమికులను మెప్పించిన ఈ బాలికల నృత్య బృందం ఇటీవల అంతర్జాకీయ వేదికపై ప్రదర్శన కనబరిచి కళా రంగంలో విశాఖకు ఉన్న పేరును ఇనుమడింపజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details