విశాఖ ఆరోగ్యకేంద్రం అవుట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. పోలీసులు అనుమతి ఇవ్వక పోవటంతో మంత్రి ఇంటి ముందు కూడలిలో బైఠాయించారు.
మంత్రి ఇంటి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన..
విశాఖలోని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటి వద్ద పట్టణ ఆరోగ్యకేంద్రం అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమను విధుల నుంచి తొలగించటంపై నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
మహిళా పోలీసులు నిరసనకారుల నుంచి శాంతిభద్రతల సమస్య రాకుండా బారికేడ్లు పెట్టారు. వాటిని దాటుకుని మంత్రిని కలవడానికి యత్నించిన నిరసనకారులను అరెస్ట్ చేశారు. కరోనా కష్ట సమయంలో తమ సేవలను వాడుకుని అర్ధంతరంగా విధులు నుంచి తొలగించడం దారుణమని తిరిగి విధుల్లో చేర్చుకోవాలని నిరసన కారులు కోరారు.
ఇదీ చదవండీ..JAGANANNA COLONIES: జగనన్న కాలనీ నిర్మాణాల్లో ఇటుక, కంకరకే ధర ఖరారు!
TAGGED:
విశాఖ జిల్లా తాజా వార్తలు