అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి గురువారం రాత్రి విశాఖ సిటీ పోలీసులు వెళ్లారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు సెక్షన్ 41కింద నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో వెనుతిరిగారు. చోడవరం మినీ మహానాడు సభలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో ఐదు రోజులు క్రితం గుంటూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజూ అయ్యన్న లేకపోవడంతో ఇలాగే వెనుతిరిగారు. అయ్యన్నపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని.. ఎలాగైనా అయ్యన్నను అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయ్యన్నపాత్రుడి ఇంటికి విశాఖ సిటీ పోలీసులు.. అందుకోసమేనా..!
Police to Ayyanna Home: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి గురువారం రాత్రి విశాఖ పోలీసులు వెళ్లారు. అయ్యన్నకు సెక్షన్ 41 కింద నోటిసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులు... ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుతిరిగారు.
అయ్యన్నపాత్రుడి ఇంటికి.. విశాఖ సిటీ పోలీసులు.. అందుకోసమేనా..!