ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Delhi tour: ఉక్కు కార్మికుల దిల్లీ యాత్ర.. ఈ నెల 2, 3న జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన

విశాఖ ఉక్కు సంకల్పాన్ని దిల్లీకి వినిపించేందుకు కార్మికలోకం కదిలింది. ఉద్యమ స్వరాన్ని మరింత ఉద్ధృతంగా కేంద్రానికి వినిపించేందుకు హస్తిన బాట(Delhi tour) పట్టారు. ఈ నెల 2, 3 తేదీల్లో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు తెలిపేందుకు... వేలాది మంది కార్మికులు విశాఖ నుంచి దిల్లీ బయల్దేరారు.

Steel workers' delhi yatra
ఉక్కు కార్మికుల దిల్లీ యాత్ర

By

Published : Aug 1, 2021, 4:41 AM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించడానికి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు దిల్లీకి(Delhi tour) తరలివెళ్లారు. ఐదున్నర నెలలుగా పోరాడుతున్నా తమ గోడు పట్టని కేంద్రానికి మరింత గట్టిగా గొంతుక వినిపించాలని సంకల్పించారు. ఈ నెల 2, 3 తేదీల్లో జంతర్ మంతర్‌ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించిన కార్మికులు శనివారం రాత్రి విశాఖ నుంచి రైలులో దిల్లీ బయల్దేరి వెళ్లారు. వేలాదిగా దువ్వాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కార్మికులు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని నినదించారు. కార్మకుల నినాదాలతో రైల్వేస్టేషన్‌ మార్మోగిపోయింది

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం ఉద్ధృతం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చాక కూడా ఉద్యమాన్ని కొనసాగించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏపీ ఏక్స్‌ప్రెస్‌లో వేలాది మంది కార్మికులు శనివారం రాత్రి బయల్దేరి వెళ్లారు. ఇవాళ మరికొందరు విమాన మార్గంలో దిల్లీ చేరుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details