విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని మంచాల, తురువోలు ప్రాంతాల్లో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. మంచాలలో 3,000 లీటర్ల బెల్లం ఊట, తురువోలులో 850 లీటర్ల ఊట గుర్తించి ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా బట్టీలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేశారు.
visakha dst police raids on natusara centers