ఓట్ల లెక్కింపునకు సంబంధించి రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం గ్రామస్థులు కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. అంతే కాకుండా చెల్లని ఓట్లుగా పేర్కొన్న 28 ఓట్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
రీకౌంటింగ్ నిర్వహించాలంటూ గ్రామస్థుల ఆందోళన - vizag district crime
విశాఖపట్నం జిల్లా బీబీపట్నంలో పరాజయం పాలైన అభ్యర్థి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. అనంతరం రీకౌంటింగ్ జరపాలని అధికారులను డిమాండ్ చేశారు.
రీకౌంటింగ్ నిర్వహించాలంటూ గ్రామస్థుల ఆందోళన
పోటీలో ఉన్న విశ్వేశ్వరరావు అనే అభ్యర్థి.. రెడ్డి లక్ష్మీపై కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. లక్ష్మీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రీకౌంటింగ్ను బహిరంగంగా జరపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.