విజయవాడలోని యూపీఎస్సీ పరీక్షల నిర్వహణను జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. నగరంలోని బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో... పరీక్ష తరగతులను గమనించారు. నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
విశాఖలో...
విశాఖలో ప్రిలిమినరీ పరీక్షలు కొవిడ్ నిబంధనల మధ్య జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లాలోని 27 పరీక్షా కేంద్రాల్లో 10,796 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కోవిడ్ నియమాలు పాటించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూపీఎస్సీ పరిశీలకులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాలు శానిటైజ్ చేసి, తాగు నీటి సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.